Wpl 2024: ఛేజింగ్ లో చరిత్ర సృష్టించింది RCB. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఓపెనింగ్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ను చిత్తు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ తరుణంలోనే… ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ చేజ్‌ను నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 202 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించి.. రికార్డు సృష్టించారు. రిచా ఘోష్ అద్భుతమైన అర్ధ సెంచరీని నమోదు చేసిన తరుణంలోనే…. శుక్రవారం రోజున మొదటి మ్యాచ్ లో బోణీ కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ఘోష్ 27 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కఠినమైన ఛేజింగ్‌లో ఎల్లీస్ పెర్రీ కూడా కేవలం 34 బంతుల్లో 57 పరుగుల స్కోరుతో దోహదపడింది. రాఘ్వీ బిస్త్ మరియు కనికా అహుజా కూడా బ్యాట్‌తో వరుసగా 25 మరియు 30 పరుగులు చేసి RCBని గెలిపించారు. దీంతో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దుమ్ములేపిన రిచా ఘోష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.