ఇవాళ ఏపీకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ !

-

నేడు బెజవాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. తమిళనాడు తంజావూర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం రానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అనంతరం మళ్లీ దేవాలయాల బాట పట్టనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయిందని చెబుతున్నారు.

Deputy CM Pawan Kalyan will come to Bejwada today

కాగా, విజయవాడ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. విజయవాడలో నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బందరు రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నట్లు తెలిపారు విజయవాడ పోలీసులు. ఇందిరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. దీంతో విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news