ఐదుగురు ప్రాణాలని నిలబెట్టిన 20 నెలల చిన్నారి..!

-

ఒక 20 నెలల చిన్నారి ఏకంగా ఐదుగురి ప్రాణాలని కాపాడింది. 20 నెలలకే నిండు నూరేళ్లూ నిండాయి. పూర్తిగా చూస్తే.. ఆనందంగా జీవించాల్సిన 20 నెలల చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కానీ ఐదుగురి ప్రాణాలని నిలబెట్టింది. ధనిష్తా అనే ఆ 20 నెలల చిన్నారి.. ఇప్పుడు దేశం లోనే అత్యంత పిన్న వయసు అవయవ దాతగా నిలిచింది.

ఈ చిట్టి తల్లి ఎంతో సరదాగా సందడి తెచ్చేది. అందమైన ఈ బొట్ట బొమ్మ తో ఇంటికే వెలుగొచ్చింది. అటువంటిది ధనిష్తా అందర్నీ విడిచిపెట్టి వెళ్లిపోవడం బాధాకరం.ఈ నెల 8న బాల్కనీలో నుంచి కింద పడిపోయింది ధనిష్తా. వెంటనే గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఈ నెల 11న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలియ జేశారు. అయితే తల్లిదండ్రులు ఆశిశ్ కుమార్‌, బబితా.. ఆ చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు.

ఇలా చేయడం మూలానే ఐదుగురి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటె పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు పేషెంట్లకు ఇచ్చినట్టు చెప్పారు. ఆసుపత్రి లో ఉన్న సమయం లో అవయవాల కోసం చూస్తున్న పలువురిని కలిసినట్టు ఆశిశ్ కుమార్ చెప్పారు. ఈ చిన్నారి చనిపోయిన వాళ్ళ అయిదుగురు లో ఆమె ఉంటుంది అని అతను చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version