బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ 2000 నోట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. 2 వేల నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. 2000 నోట్లు ఉన్నవారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలని సూచించారు.
చిన్న నోట్లను రద్దు చేసి పెద్ద నోట్లను చలామణిలో ఉంచడం సరికాదన్నారు ఎంపీ సుశీల్ మోదీ. అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో కూడా పెద్ద నోట్లు చలామణిలో లేవన్నారు. 2 వేల నోట్లను డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్లధనానికి పర్యాయపదంగా మారిందన్నారు. బిజెపి ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.