ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడురోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రామ మందిర్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పూజారుల పోస్టులకు నియామక క్రతువు చేపట్టగా 3వేల దరఖాస్తులు వచ్చాయని ట్రస్ట్ అధికారి తెలిపారు. వీరిలో కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా, సుప్రసిద్ధ అయోధ్యలో భవ్యరామమందిరలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సుమూహుర్తం ఖరారైంది. యూపీలోని అయోధ్య రామాలయంలో వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించనున్నారు.