BREAKING : భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ : డబ్ల్యూహెచ్‌ఓ

-

భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సంక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ ఫ్లూ (Bird flu) అప్పుడప్పుడు మనుషుల్లో కూడా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పశ్చిమ్‌ బెంగాల్‌లో ఈ కేసు వెలుగు చూసినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కొద్దిరోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

ఆ చిన్నారి ఇంటితో పాటు సమీపంలో కోళ్లు ఎక్కువగా ఉండేవని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. ఆ కుటుంబంలో మరెవరికీ ఈ వైరస్‌ నిర్ధారణ కాలేదని వెల్లడించింది. భారత్‌లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తు చేసింది. ఈ వైరస్ రకంతో వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటాయని పేర్కొంది. మరోవైపు బర్డ్‌ఫ్లూ H5N2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version