అయోధ్య మందిరానికి బాహుబలి తాళం.. 400 కిలోల బరువు

-

అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం కోసం బాహుబలి తాళాన్ని రూపొందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నిపుణుడు 400 కేజీల బరువైన తాళం తయారు చేశారు. తాళాల నగరంగా పేరున్న అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ.. రాముడి భక్తుడు. తాళాల తయారీలో నిపుణుడు కూడా. అయోధ్య రామాలయం కోసం సత్యప్రకాశ్‌ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని సిద్ధం చేశారు. దీనిని త్వరలోనే అయోధ్యలో రామాలయ అధికారులకు అందజేయనున్నారు.

“అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకుని పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని, నాలుగు అడుగుల చెవిని తయారు చేశాను. ఈ తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వార్షిక అలీగఢ్‌ ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం తాళానికి సంబంధించి అతి సూక్ష్మ మార్పులు, వివిధ రకాల అలంకరణలు చేస్తున్నాను. ఈ తాళం తయారీలో నా భార్య రుక్మిణి ఎంతగానో సహకరించింది. తయారీకి రూ.2 లక్షలు వెచ్చించించాం.” అని సత్యప్రకాశ్ శర్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version