ఢిల్లీలో కుండపోత వర్షం..ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్

-

6 Injured After Portion Of Roof At Delhi Airport Collapses On Vehicles : ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు..మొత్తం జలమయమయ్యాయి. దీంతో నిన్నటి నుంచి ఢిల్లీలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

6 Injured After Portion Of Roof At Delhi Airport Collapses On Vehicles

కార్లు, బైకులు…పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. అటు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలింది రూఫ్. ఇక ఆ ఎయిర్‌ పోర్టు రూఫ్ కూలడంతో కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. దీంతో బాధితులను ఎయిర్‌పోర్టు మేదాంతకు తరలించారు. ఇక దీనిపై పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version