విశాఖలో 65 ఇ-ఆటోలు ప్రారంభించిన మంత్రి విడదల రజిని

-

సుస్థిర పర్యావరణం కోసమే ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని, అందుకోసమే ఇ-ఆటోల వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇంచార్జి, వైద్య ఆరోగ్య , వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం జిల్లా కు కేటాయించిన ఇ-ఆటోలను బీచ్‌రోడ్డులో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమం లో ఆమె ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ ఆసియాకు చెందిన ‘అర్బన్‌ క్లయిమేట్‌ చేంజ్‌ రెసిలెన్స్‌ ట్రస్ట్‌ ఫండ్‌’ మరియు విశాఖ`చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి కింద డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) నిధులతో ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. వీసీఐసీడీపీ పథకంలో భాగంగా నాలుగు స్వైపింగ్‌ కమ్‌ సర్వీస్‌ స్టేషన్లను ముడసర్లోవ, శాంతిఆశ్రమం, టౌన్‌ కొత్తరోడ్డు ప్రాంతాల్లో నిర్మించినట్టు తెలిపారు. అంతేకాకుండా 180 లిథియం-అయాన్‌ స్మార్ట్‌ బ్యాటల్ని సిద్ధం చేశామన్నారు. ఏడీపీ డీజీ మనీలా సహా జీ`20ప్రతినిధులు ఇప్పటికే ఆయా కేంద్రాల్ని సందర్శించారని గుర్తు చేశారు. మెరుగైన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం స్వైపింగ్‌ స్టేషన్లను, ఇ-ఆటోలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇ-ఆటోల వలన కాలుష్యం తగ్గుతుందని వాటి ప్రత్యేకతను తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version