కాంగ్రెస్ లోకి రావాలని జూపల్లి కృష్ణారావుకు చెప్పానని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో జూపల్లి కృష్ణారావు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని.. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ ఎంటో చూడండని తెలిపారు.
షర్మిల పార్టీలోకి వస్తే మంచిదేనని.. జూపల్లి నేను పాత మిత్రులం అని వెల్లడించారు. కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పానన్నారు కోమటి రెడ్డి. జూపల్లి మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు అన్నారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు జూపల్లి. అయితే కోమటిరెడ్డి ఇంటికి కేవలం చాయ్ తాగడానికి మాత్రమే వచ్చానని చెప్పడం కోసం మెరుపు.