World Cup 2023 : 7 వికెట్ల వీరుడు షమీ సంచలన రికార్డు

-

World Cup 2023 : 7 వికెట్ల వీరుడు షమీ సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇండియా తరఫున సెమీస్‌ లో 7 వికెట్లు పడగొట్టి.. దిగ్గజాల సరసన నిలిచాడు షమీ. తొలిసారిగా 1983 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ బౌలర్ విన్ స్టన్ డేవిస్…. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టారు.

7 wicket hero Shami sensational record
7 wicket hero Shami sensational record

ఆ తర్వాత 20 ఏళ్లకు గాని ఈ రికార్డు మళ్లీ నమోదు కాలేదు. 2003 WCలో ఆసీస్ బౌలర్లు గ్లెన్ మెక్ గ్రాత్, ఆండీ బిచెల్…. నమీబియా, ఇంగ్లాండ్ పై ఈ ఫీట్ సాధించారు. 2015లో టీం సౌథీ(NZ) ఇంగ్లాండ్ పై, తాజాగా భారత్ బౌలర్ షమీ కివీస్ తో పోరులో 7 వికెట్లు పడగొట్టారు.

ఇది ఇలా ఉండగా.. న్యూజిలాండ్ పై సెమీస్ లో గెలిచిన భారత్….వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15న జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో భారత్ 70 పరుగులు తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news