ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా సీజ‌న‌ల్‌ ఉద్యోగాలు..

-

రీటైల్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీగా సీజనల్‌ ఉద్యోగ నియామకాలను చేప‌ట్టేందుకు రెడీ అవుతోంది. వ‌చ్చే వ‌రుస పండుగల‌ సీజన్ల‌‌తో పాటు తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌ ఆఫర్‌ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 70వేల ప్రత్యక్ష, లక్షలాది పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇందులో ప్రత్యక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్‌ పోస్టుల్లో భర్తీ చేయనుండగా, పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని తన అమ్మకపు భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పించనుంది.

లక్షల మంది ఈ–కామర్స్‌ కస్టమర్లు ఆన్‌లైన్‌లో సాఫీగా షాపింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కలి్పంచేందుకు ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. కొత్తగా ఎంపికైన వారికి కస్టమర్‌ సర్వీస్, డెలివరీ, ఇన్‌స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్‌తో పాటు పీఓఎస్‌ మెషీన్లు, స్కానర్లు, మొబైల్‌ అప్లికేషన్లను ఆపరేట్‌ చేయడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని కంపెనీ పేర్కొంది. దేశంలో 50 వేల చిన్న కిరాణాషాపులు, పెద్ద హోల్‌సేల్‌ దుకాణాలతో ఫ్లిప్‌కార్ట్‌ గతవారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే.. క‌రోనా కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగుల‌కు ఈ నియామ‌కాలు ఎంతో ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news