ఫార్మాసీ ఉద్యోగీ అకౌంట్ లో రూ.753 కోట్లు.. ఏం చేశాడంటే..?

-

సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయల వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సామాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపే పొరపాట్లను తెలుసుకొని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతా నుంచి అక్టోబర్ 06న రూ.2000లను స్నేహితుడికి బదిలీ చేశాడు. ఈ లావాదేవీ తరువాత తన అకౌంట్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోగా.. రూ.753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది.

బ్యాంకు అకౌంట్ లో అంత పెద్ద మొత్తం కనిపించే సరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్ ను స్థంబింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడో సారి కావడం విశేషం. వేర్వేరు వ్యక్తులకు  మొదటి సారి 9,000 కోట్లు, రెండోసారి రూ.756 కోట్లు జమ అవ్వడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version