ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య.. అదే కారణమా..?

-

ఉత్తర్​ప్రదేశ్​.. దేవరియా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇవాళ జరిగిన ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి పరుగులు తీశారు. ఈ దారుణహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రపుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఫతేపుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లెధాన్ టోలె ప్రాంతంలో సత్యప్రకాశ్​ దుబే అనే వ్యక్తికి అభయ్​పురా టోలెకు చెందిన మాజీ జిల్లా పంచాయజీ సభ్యడు ప్రేమ్​చంద్​ మధ్య కొంత కాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ప్రేమ్​చంద్ దారుణ​ హత్యకు గురయ్యాడు. దీంతో ఈ పని సత్యప్రకాశ్​ చేశాడని కోపంతో ఊగిపోయిన కొందరు దుండగులు.. అతడి ఇంటిపై దాడికి దిగి సత్యప్రకాశ్​తో పాటు అతడి భార్యాపిల్లలు సహా ఇంట్లో ఉన్న మరో వ్యక్తిని హతమార్చారు.  ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version