అత్యాచారం, లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా మరో కేసు నమోదైంది. తన ఫోన్ నెంబరు తీసుకున్న ప్రజ్వల్.. తరచూ వీడియో కాల్ చేసి సతాయించేవాడని ఓ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెకు ఒక పాఠశాలలో సీటు ఇప్పించాలని ప్రజ్వల్‌ను కోరిన సమయంలో ఆమె ఫోన్ నంబరు తీసుకుని, వీడియో కాల్ చేసేవాడని సీఐడీ సైబర్ క్రైమ్ ఠాణాలో చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
తనను నగ్నంగా మారాలంటూ ఒత్తిడి తీసుకువచ్చేవాడని, న్యూడ్గా మారిన తర్వాత అతను స్వయంతృప్తి పొందేవాడని పోలీసులకు తెలిపారు. తన వీడియోలను సెల్‌ఫోన్లో సేవ్ చేసుకుని, వాటిని చూపిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించేవాడని ఆరోపించారు. ఇది ప్రజ్వల్‌పై నాలుగో కేసు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను వైరల్ చేసిన కిరణ్, శరత్, మాజీ ఎమ్మెల్యే ప్రీతంగౌడలపైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోరగా.. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ప్రత్యేక దర్యాప్తు దళానికి అప్పగించారు.