ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌కు ఛాన్స్ : డివిలియర్స్

-

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో చేరుతారన్న వార్తల నేపథ్యంలో డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”గుజరాత్ టైటాన్స్ జట్టులో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ హార్దిక్ MI జట్టులోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీం ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ…. MI నాయకత్వ బాధ్యతలను హార్దిక్ కు అప్పగించే అవకాశం ఉంది.

AB de Villiers predicts Hardik Pandya to lead Mumbai Indians in the next season

ఇది ఆ జట్టుకు చాలా లాభదాయకం” అని పేర్కొన్నారు. కాగా, ఇంగ్లాండ్ కీలక ప్లేయర్ జో రూట్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు వచ్చె ఏడాది ఐపీఎల్ ఆడట్లేదని తెలిపారు. “మేము అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాం. రూట్ అనుభవం గతేడాది జట్టుకు బాగా ఉపయోగపడింది. అతడి కెరీర్ బాగా కొనసాగాలని కోరుకుంటున్నా” అని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ సంగక్కర తెలిపారు. రూట్ ను గతేడాది రూ. కోటి బేస్ ప్రైస్ కి RR తీసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news