2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచిన సినీతారలు వీరే

-

వెండితెరపై ప్రేక్షకులను మైమరింపించిన సినీతారలు ఎన్నికల బరిలో దిగి తమ అ దృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు ఏళ్ల తరబడి రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే.. మరికొందరు కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి గెలుపు బాట పట్టారు. అలా సినీ తారలు రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర  వేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు వీరికి టికెట్లు ఇచ్చి తారల ప్రజాకర్షణ శక్తిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేశాయి. చాలా చోట్ల వీరికి దాదాపుగా సానుకూల ఫలితాలే వచ్చాయి. మరి ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సినీ తారలెవరో చూద్దామా?

రామాయణ్​లో రాముడిగా నటించి మన్ననలు పొందిన అరుణ్ గోవిల్ యూపీలోని మేరఠ్ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి గెలుపొందారు. మరోవైపు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (బీజేపీ) రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. యూపీలో మథుర నుంచి హేమమాలిని (బీజేపీ) విజయం సాధించారు. యూపీలోని గోరఖ్​పుర్ నుంచి నటుడు రవికిషన్ బీజేపీ తరఫున బరిలోకి దిగి విజయఢంకా మోగించారు.

టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా బెంగాల్​లోని ఆసన్​సోల్ నుంచి గెలుపొందారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ రాణా బీజేపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బెంగాల్​లోని హుగలీ నుంచి టీఎంసీ తరఫున రచనా బెనర్జీ గెలుపొందారు. తమిళనాడు విరుధునగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నటి రాధిక ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version