టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్ ఉండనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్ ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమికి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు చంద్రబాబు.
అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళతారు. ఇక ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ నేతలతో చంద్రబాబు భేటీ ఉంటుంది. ఈ సమావేశంలో చంద్రబాబు, నితీష్‌కుమార్, ఎన్డీఏ భాగస్వాములు హాజరుకానున్నాయి.
మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత మంగళవారం రోజున చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది.