చైనా నుంచి దేశంలోకి మరో కొత్త వైరస్!

-

ప్రపంచానికి పట్టిన శని చైనా అన్న రేంజ్ లో అమెరికా.. ఈ కరోనా పేరు చెప్పి చైనాను వాయిస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయాలపై కొంతమంది కాస్త ఫీలయినా… జరుగుతున్న సంఘటనలు, జరిగిన ఉపద్రవాలు గమనిస్తే మాత్రం.. అమెరికా మాటల్లో తప్పేమీ లేదన్నట్లు అనిపిస్తుంది. విషయానికొస్తే… అస‌లే దేశం మొత్తం కరోనా వైర‌స్ తో అల్లల్లాడిపోతూ ఉంటే… తాజాగా మ‌రో వైర‌స్ వెలుగుచూసింది. ఇది ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూగా పిలి‌చే వైర‌స్ అని, ఇది దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా అస్సాంలో బ‌య‌ట‌ప‌డిందని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కరోనా పేరు అనంతరం వైరస్ అనే పేరు వినిపిస్తే వణికిపోతున్న రోజుల్లో ఈ సంఘటన వెలుగుచూసింది.

అవును… భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి) ఈ కొత్త వైర‌స్‌ ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అని ధృవీకరించిన‌ట్లు తెలిపింది. ఈ వైరస్ వల్ల అస్సాంలో ఇప్ప‌టివ‌ర‌కు 306 గ్రామాల్లో 2,500 పందులు మ‌ర‌ణించాయి. పందుల లాలాజలం, ర‌క్తం, మాంసం ద్వారా ఈ వైర‌స్ అనేది వ్యాప్తి చెందుతుంది. అదేవిదంగా పందుల్లో సంక్ర‌మించే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంటువ్యాధి కావ‌డంతో దీని నివారణకు పందుల‌ను సామూహికంగా చంపేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ఇప్పటికే అనుమ‌తినిచ్చింది. ఈ విషయపై ఆలోచించిన అస్సాం ప్రభుత్వం… తాము ఆ ప‌నిని చేయ‌మ‌ని, ప్ర‌త్యామ్నాయ ప‌ద్ద‌తుల్లో అడ్డుక‌ట్ట వేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ఈ క్రమంలో వైర‌స్ ప్ర‌బ‌లిన జిల్లాల నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు పందుల ర‌వాణా ఆపేశామ‌ని తెలిపిన అస్సాం ప్రభుత్వం… పొరుగు రాష్ట్రాలు కూడా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా కోరుతోంది. ఈ వైర‌స్ ఇంకా పెద్ద‌గా వ్యాప్తిచెంద‌లేద‌ని, ఇప్ప‌టికే నమూనాలు సేక‌రించి మూడు ప్ర‌త్యేక ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్రభుత్వం చెబుతుంది. అయితే… దీనివల్ల మ‌నుషుల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని, దీనికి కోవిడ్‌ తో ఎటువంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు శాస్త్రవేత్తలు! కాగా… 2019 ఏప్రిల్‌లో ఈ వైర‌స్ చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్ గ్రామంలో బ‌య‌ట‌ప‌డింద‌ని, అక్క‌డినుంచి అరుణాచ‌ల్ మీదుగా అస్సాంలో వ్యాధి ప్ర‌బ‌ల‌డానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని అధికారులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version