పాక్ తో యుద్ధం.. ప్రధాని మోదీతో అజిత్ దోవల్ అత్యవసర భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నివాసానికి వచ్చిన దోవల్..అత్యవసర భేటీ అయ్యారు. కశ్మీర్ దాడులపై చర్చిస్తున్నారు మోదీ, దోవల్. పాక్ సైనిక చర్యలను పర్యవేక్షిస్తున్నారు మోదీ, దోవల్.

కాగా, గురువారం రాత్రి పాకిస్థాన్ అనేక నగరాలపై సడెన్ క్షిపణి దాడికి పాల్పడింది. జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత వైమానిక రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా స్పందించి, పాక్ క్షిపణులను గాల్లోనే నిలిపేసింది. అధునాతన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో ఈ దాడిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా, దాడికి ఉపయోగించిన పాకిస్థాన్ కు చెందిన మూడు యుద్ధ విమానాన్ని కూల్చివేయడం విశేషం.