అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్ ప్రభావం రాజస్థాన్‌పై కూడా పడింది. ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలు వరదమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఎటుచూసినా వాన నీటితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నగరాల్లోనూ రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పనులపై బయటకు వెళ్లే వారంతా వరద నీటిలో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు.
అజ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రి జలమయమైంది. ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీగా నీరు చేరింది. రోగుల ఉండే గదుల్లోకి వరద చేరింది. వరదతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా రోగులకు చికిత్స అందించడానికి ఆటంకం కలుగుతోందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు బిపోర్‌జాయ్ ప్రభావం వల్ల రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
#WATCH Rajasthan | Ajmer's Jawaharlal Nehru Hospital flooded following heavy rainfall in the city. (18.06) pic.twitter.com/eOOVNF39sE
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 18, 2023