IPL 2023 : క్రికెట్ చరిత్రలోనే సంచలనం..ఆకాశ్‌ మధ్వాల్‌ అరుదైన రికార్డు

-

LSG తో మ్యాచులో ముంబై యంగ్ బౌలర్ ఆకాష్ మద్వాల్ సంచలనం సృష్టించారు. తక్కువ ఎకానమీ రేటు (1.43)తో 5/5 వికెట్లు తీసిన తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ ప్లేయర్ అంకిత్ రాజ్ పుత్ (5/14), వరుణ్ చక్రవర్తి (5/20), ఉమ్రాన్ మాలిక్ (5/25) ఉన్నారు. అలాగే 2009లో కుంబ్లే ఆర్సిబి తర్వాత 5 పరుగులకు ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా మద్వాల్ ఘనత సాధించారు.

కాగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై బౌలర్లలో మద్వాల్ 5 వికెట్లు, జోర్డాన్, పియూష్ చేరో వికెట్ తీశారు. లక్నోలో ముగ్గురు బాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫైయర్-2 లో గుజరాత్ తో తలపడునుంది. ఓటమిపాలైన లక్నో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది.

Read more RELATED
Recommended to you

Latest news