గొప్ప మనసు చాటుకున్న విజయ్ ఆంటోనీ..!

-

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు మళ్లీ బిచ్చగాడు 2 తో వచ్చి మరో విక్టరీని తన ఖాతాలో వేసుకున్న ఈయన తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నాడు.. ఇకపోతే బిచ్చగాడు 2 సినిమా కోసం అన్ని తానే అయి పని చేసిన విజయ్ ఆంటోని హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా సినిమాను తన భుజాలపై మోసారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన సంతోషంలో మునిగిపోయారు.

బుధవారం తిరుపతిలో సందడి చేసిన ఆయన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా తిరుపతికి వచ్చారు. ఇక తిరుపతి కపిల తీర్థంలోని రోడ్డులో ఉన్న యాచకులను కలిసిన విజయ్ ఆంటోని వారికి యాంటీ బికిలీ పేరిట కిట్లను అందజేశారు. అందులో దుప్పటి, చెప్పులు, అద్దం , నూనె బాటిల్ ,సబ్బు, దువ్వెన, విసనకర్ర వంటి కిట్స్ యాచకులకు అందజేశారు విజయ్ ఆంటోని. అంతేకాదు వారితో కాసేపు గడిపాక మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు అయితే దీనిని తాను ఊహించలేకపోయాను అంటూ తెలిపారు.

ఇక బిచ్చగాడు 3 స్టోరీ లైన్ విషయంలో ఇంకా ఏమీ అనుకోలేదని.. కచ్చితంగా రెండు మూడు నెలల్లో దాన్ని కూడా ఫైన్లేస్ చేస్తాను అని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో కచ్చితంగా 50 రోజులు ఆడుతుందని.. ఒకవేళ అలా ఆడితే మళ్ళీ అర్ధ శత దినోత్సవం రోజు తిరుపతికి వచ్చి అందరినీ కలుస్తానని వెల్లడించారు. మొత్తానికైతే విజయ్ ఆంటోని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news