‘సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్’ .. పార్లమెంట్​లో ఇంట్రెస్టింగ్ మ్యాప్

-

నూతన పార్లమెంట్ భవనం ఆదివారం రోజున అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్​కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్ని ఆసక్తికరమైన ఫొటోలను ప్రజా ప్రతినిధులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటున్నారు. అలా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫొటో చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..?

పార్లమెంట్ భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్ పురాతన భారతదేశాన్ని సూచించే విధంగా ఉంది.​ అందులో ప్రస్తుతం పాకిస్థాన్​లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్​ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్’ అంటూ ట్వీట్ చేశారు.

‘అఖండ భారత్’ భావన అనేది ప్రస్తుత అఫ్గానిస్థాన్​, పాకిస్థాన్​, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడిన భౌగోళిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతదేశాన్ని సూచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version