లోక్సభ ఎన్నికల తర్వాత యూపీలోని బీజేపీ ప్రభుత్వంలో కుమ్ములాటలు తారస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ తాజాగా మాన్‌సూన్ పేరుతో బంఫర్ ఇచ్చింది. 100 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయిస్తే కొత్తప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని బీజేపీ అసంతృప్తులకు సిగ్నల్ ఇచ్చింది. సీఎం యోగీ, డిప్యూటీ సీఎం మౌర్య మధ్య సంబంధాలు దెబ్బతినటంతో ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే లక్ష్యంతోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు టాక్.
అయితే అఖిలేశ్ తన పోస్టులో ఏ బీజేపీ నాయకుడి పేరు ప్రస్తావించలేదు. కానీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విభేదిస్తున్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించి అఖిలేశ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2022లో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ 111 స్థానాలు గెలిచింది. బీజేపీలోని వంద మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే తాము సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలమని అఖిలేశ్ పేర్కొన్నారు.