.ఈ సారి బీజేపీ గెలవడం కష్టమే
.తన వద్ద కొత్త ఫార్ములా ఉందన్న అఖిలేష్ యాదవ్
.పెద్ద పార్టీల మద్దతు కూడా అవసరమని వ్యాఖ్య
2014,2019 ఇలా వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతాపార్టీ. ముచ్చటగా మూడోసారి 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో రాజకీయాలను ముమ్మరం చేసింది కమలం పార్టీ. ఈ సారి దక్షిణాదిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అగ్ర నేతలు.ఈ పసారి దక్షిణాదిలో ఎంపీ సీట్లను పెంచుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణ,తమిళనాడు,కేరళ రాష్ర్టాల ప్రజలను ఆకట్టుకునేలా వివిధ కార్యక్రమాలను చేస్తున్నారు బీజేపీ నేతలు.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రత్యేక కూటమి ఏర్పాటైంది. ఈ సారి బీజేపిని ఓడించడమే ప్రధాన అజెండాగా ప్రతిపక్షాలను ఏకం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కలిసి వచ్చే వారిని కలుపుకోవడంతో పాటు కేంద్రం పట్ల అసంతృప్తిగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలను ఈ కూటమిలో చేర్చుకుంటున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వరుస భేటీలు ఏర్పాటు చేసుకుంటూ సార్వత్రిక ఎన్నికల కోసం ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో వారు బిజీగా ఉన్నారు.బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే యూపీ మాజీముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి బీజేపీని ఓడించడం చాలా సులభమన్నారు.అంతే కాదు ఇందుకోసం తన వద్ద కొత్త ఫార్ములా ఉందని ఓ ఛానల్‌కి వచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.కాషాయ పార్టీని ఓడించే సత్తా పీడీఏ కూటమికి ఉందని వ్యాఖ్యానించారు. పీడిఏలో పీ అంటే వెనుకబడిన వర్గాలు,డి అంటే దళితులు,ఏ అంటే అల్ప సంఖ్యాక వర్గాలు. . . .ఈ ముగ్గురిని ప్రభావితం చేయగలిగితే బీజేపీ ఓటమి ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. ఓ వైపు కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంటే అఖిలేష్ ఇలా వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి కూటమిలో కలిసేందుకు అంగీకరించని అఖిలేష్…. ఏదైనా పెద్ద రాజకీయ పార్టీ మద్దతిస్తే బీజేపీని సింపుల్‌గా ఓడిస్తామని ధీమా వ్యక్తపరిచారు.