పబ్లిక్ గా కుల దూషణ చేస్తేనే SC/ST చట్టం వర్తిస్తుంది : హైకోర్టు

-

ఎవరినైనా పబ్లిక్గా కుల దూషణ చేస్తేనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగంగా బెదిరించడం లేదా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయని తెలిపింది. బహిరంగ ప్రదేశంలో ఈ చర్య జరగకపోతే ఎస్సీ,ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్) ప్రకారం అసలు నేరం జరిగినట్టే కాదని వెల్లడించింది. దీనిని మరో సెక్షన్ల కింద నమోదు చేయాలని సూచించింది.

ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన పింటూ సింగ్ అలియాస్ రాణా ప్రతాప్ సింగ్ తన ఇంట్లోకి ప్రవేశించి కులపరంగా దూషిస్తూ కొట్టారని ఓ వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును సవాల్ చేస్తూ పింటూ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ ఘటన బహిరంగ ప్రదేశంలో జరగలేదని, ఫిర్యాదుదారుడి ఇంట్లోనే జరిగిందని బాధితుడి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ప్రైవేట్గా చేసిన వ్యాఖ్యలతో ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోలేమని, పబ్లిక్లో వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version