భక్తులకు అలర్ట్. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఏటా ఇదే సమయంలో అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు భక్తులు.

నిన్న జెండా ఊపి యాత్రను లాంఛనంగా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది. కాగా చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను నిలిపేసింది ప్రభుత్వం. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.