హిందూ ముస్లింలు కలిసుండటమే భారత సంప్రదాయం: అమర్త్యసేన్

-

ఎటువంటి భేషజాలు లేకుండా హిందువులు, ముస్లింలు కలిసి జీవించే సంప్రదాయం భారతదేశానికి ఉందని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త  అమర్త్యసేన్(90) అన్నారు. మన దేశ చరిత్రను పరిశీలిస్తే హిందువులు, ముస్లింలు సంపూర్ణ సమన్వయం, సామరస్యంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ‘జుక్తోసాధన’ అంటారని క్షితిమోహన్ సేన్  తాను రాసిన ఓ పుస్తకంలో చెప్పారు. అలీపూర్‌ జైలు మ్యూజియంలో జరిగిన పుస్తక పఠనానికి సంబంధించి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మధ్య విభేదాలు తలెత్తుతున్న నేటి సమాజంలో మతసహనం అవసరమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రజలంతా కలిసి పని చేయాలని చెప్పారు.  మతపరమైన అణచివేతలకు పాల్పడుతున్న వారు ముంతాజ్ కుమారుడు దారాషికో ఉపనిషత్తులను పార్సీలోకి అనువదించారన్న విషయాన్ని మరిచిపోతున్నారని చురకలు అంటించారు. పిల్లల్లో ఎలాంటి భేద భావాలు ఉండవు కాబట్టి వారిలో ఈ సమస్యలు తలెత్తవని వెల్లడించారు. దీనిని పూర్తిగా నిర్మూలించాలంటే వారిలో మతపరమైన విషబీజాలు నాటకూడదని అన్నారు. కళలు, సామాజిక సేవ, రాజకీయాల్లో ‘జుక్తోసాధన’ కనిపిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version