రెండు వేల నోట్లను ఇకపై తీసుకోమని ప్రకటించిన అమెజాన్‌

-

ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి తొలగించింది. ఇప్పటికే ప్రజల దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్‌ 30 వరకూ గడువు ఇచ్చింది. ఆ గడువుకు ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ క్రమంలోనే.. అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ పేమెంట్‌లో కష్టమర్లు ఇచ్చే 2000 నోట్లను సెప్టెంబర్‌ 19 నుంచి తీసుకోమని తెలిపింది.

ఇప్పటివరకు రూ. 2 వేల నోట్లను క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో కస్టమర్ల నుంచి తీసుకుంటున్నామని.. వాటిని బ్యాంకుల్లో మార్చుకునే గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తున్నందున వాటిని కస్టమర్ల నుంచి తీసుకోకూడదని నిర్ణయించినట్లు ఆమెజాన్ ప్రకటించింది. అయితే ఒకవేళ తాము ఆ ప్రొడక్ట్స్‌ను వేరే థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్ నర్ ద్వారా డెలివరీ చేస్తే, ఆ థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్ నర్ నిబంధనలు వర్తిస్తాయని, వారి నిబంధనల్లో రూ. 2 వేల నోట్లను తీసుకునే వెసులుబాటు ఉంటే తమకు అభ్యంతరం లేదని వివరించింది. ఆమెజాన్‌లో కొనుగోలు చేసిన ప్రొడక్ట్స్‌కు ఆన్ లైన్‌లో చెల్లింపులు జరపవవచ్చు. లేదా ఆ ప్రొడక్ట్‌ను డెలివరీ చేసిన సమయంలో డెలివరీ ఏజెంట్‌కు క్యాష్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.

సమయం లేదు త్వరపడండి..

మీ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను మీ ఖాతా ఉన్న బ్యాంక్‌లో జమ చేసుకోవచ్చు. లేదా రోజుకు రూ. 40 వేల పరిమితితో ఏదైనా బ్యాంక్ శాఖలో వేరే కరెన్సీతో మార్పిడి చేసుకోవచ్చు. అయితే, ఈ వెసులుబాటు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది. రూ. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు మే 19న ఆర్బీఐ (RBI) ప్రకటన చేసింది. ఆ తరువాత 20 రోజుల్లోనే 50% నోట్లు బ్యాంకులకు తిరిగివచ్చాయి.

ఏది ఏమైనా… అప్పటి వరకూ వాల్యూ ఉన్న కరెన్సీ నోటు.. ఒక గడువు తరువాత చిత్తుకాగితంలా మారిపోవడం మనమే చూస్తున్నాం కదా..! విలువ లేకపోతే ఏదైనా అంతే.. మనిషినా, మనీ అియినా.. వాటికి వాల్యూ ఉన్నంత కాలమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version