అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించిన బీజేపీ ఈసారి 300 సీట్లతోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన ఫలితాల్లో బీజేపీకి 300 వరకు సీట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ఇండియా కూటమి దూసుకెళ్తోంది. అయితే కీలక స్థానాల్లో మాత్రం ముఖ్యనేతలు ఎప్పటిలాగే తమ ప్రభావం చూపారు. అలా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా భారీ మెజార్టీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ సోనాల్ రమణ్‌భాయ్‌పై 7.4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991 ఎన్నికల్లో అడ్వాణీ ఈ స్థానం నుంచే విజయం సాధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయీ బరిలోకి దిగి గెలిచారు. 1996లోనే జరిగి ఉప ఎన్నికల్లో విజయ్‌భాయ్ పటేల్ గెలిచారు. అనంతరం 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో అడ్వాణీ వరుసగా విజయం సాధించి సత్తా చాటారు. అడ్వాణీ ఆరోగ్య కారణాలతో వల్ల 2019లో అడ్వాణీ స్థానంలో బరిలోకి దిగిన అమిత్ షా 69.67 శాతం ఓట్లతో గెలుపొందారు.