ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు అమిత్ షా. పాకిస్తాన్ పై వార్… అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనే ఆపరేషన్ సిందూర్ అన్నారు అమిత్ షా. భారత్ పై, భారతదేశ ప్రజలపై దాడులకు పాల్పడితే మోడీ సర్కార్ తగిన విధంగా బుద్ది చెబుతుందని హెచ్చరించారు.

ఇండియన్ ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నామని చెప్పారు. ఉగ్రవాద మూలాల నిర్మూలనకు భారత్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అటు ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు. పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత ఆర్మీకి సెల్యూట్ అన్నారు కేటీఆర్. భారత భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా దాడి చేసిన భారత సాయుధ బలగాల పట్ల గర్వంగా ఉందన్న హరీశ్ రావు.. పోస్ట్ సిపెట్టారు.