పాక్ వక్ర బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లొని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. హతమైన టెర్రరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయినప్పటికీ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది పాకిస్థాన్.

పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందారు. LOC సమీపంలోని గ్రామాలపై ఫిరంగులతో పాక్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తంగర్ గ్రామంలో ఓ కశ్మీర్ పౌరుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత్ ఆర్మీ.