ఈడీకి టీఎంసీ నేత మస్కా.. అరెస్ట్ చేసి కాపాడిన పోలీసులు

-

టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ ఈడీకి మస్కా కొట్టారు. ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఈ నేతను పోలీసులు కాపాడారు. ఎలా అంటే.. ఈడీ నుంచి ‘కాపాడేందుకు’ అనుబ్రతా మోండల్​ను రాష్ట్ర పోలీసులు ఓ పాత కేసులో అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను దుబ్రాజ్​పుర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయన్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా అనుబ్రతా మోండల్​ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకుంది. కేసులో నిందితుడైన ఎనముల్ హక్, మాజీ బాడీగార్డ్ సైగల్ హొస్సైన్​తో కలిపి మోండల్​ను దిల్లీలో విచారించాలని అనుకుంది. అయితే, బంగాల్ పోలీసుల రంగప్రవేశంతో సీన్ మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version