కోర్టు ఆదేశిస్తేనే.. బ్రిజ్‌ భూషన్​ అరెస్టు : కేంద్ర మంత్రి

-

భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని.. అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. గత కొంతకాలంగా రెజ్లర్లు దిల్లీలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొన్నటిదాకా సైలెంట్​గా ఉన్న కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా స్పందిస్తోంది. ఇప్పటికే రెజ్లర్లతో అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో.. బ్రిజ్ భూషన్​పై ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ వ్యవహారంపై అనురాగ్ ఠాకూర్ మరోసారి స్పందించారు. కోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే బ్రిజ్ భూష‌ణ్ అరెస్టు ఉంటుంద‌ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి స్పష్టం చేశారు. మ‌హిళా రెజ్ల‌ర్లు చేసిన డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. అయితే బ్రిజ్ భూష‌ణ్ అరెస్టు మాత్రం కోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని తెలిపారు. లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డిన బ్రిజ్‌ను అరెస్టు చేయాల‌ని రెజ్ల‌ర్ సాక్షీ మాలిక్‌తో పాటు ఇత‌ర రెజ్ల‌ర్లు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version