క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన భారత్-పాక్ మ్యాచ్ ఈ నెల 2న వర్షంతో అర్ధాంతరంగా రద్దయింది. దీంతో నిరాశగా ఉన్న ఫ్యాన్స్ కు వచ్చే ఆదివారం లోటు తీరిపోనుంది. షెడ్యూల్ ప్రకారం కోలంబోలో ఈ సూపర్-4 మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షాల నేపథ్యంలో వేదికను ఆసియా క్రికెట్ కౌన్సిల్ మార్చనుంది. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ ను నిర్వహించాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, ఆసియా కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా శుభారంభం చేసింది. నిన్న నేపాల్ జట్టుపై జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. అయితే నేపాల్ బ్యాటింగ్ చేసిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో డక్వర్తు లూయిస్ ప్రకారం 147 పరుగులకు లక్ష్యాన్ని కుదించారు అంపైర్లు. అయితే ఆ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లలో చేదించేసింది టీమిండియా.