ఆసియా కప్ షెడ్యూల్ కు ముహుర్తం ఫిక్స్..!

-

ఆసియా కప్ షెడ్యూల్ కు ముహుర్తం ఫిక్స్. ఆసియా కప్ నిర్వహణకు అడ్డంకులు తొలగి పోయాయి. ఇవాళ సాయంత్రం 7:45 గంటలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించనుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్ని జరగనుంది.

పాక్ లో నాలుగు మ్యాచ్లు, శ్రీలంకలో 9 మ్యాచ్లు నిర్వహిస్తారు. పాకిస్తాన్, ఇండియా, నేపాల్ ఒక గ్రూప్ లో… బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరో గ్రూప్ లో ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తాయి.

కాగా, ఇవాళ ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా.. ఇండియా ఏ జట్టు మరియు పాకిస్తాన్ ఏ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version