బెంగళూరులో ఉగ్రకుట్రను కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భగ్నం చేశారు. బెంగళూరులో బాంబు దాడికి ప్లాన్ చేసిన నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిందితులను సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదాసిర్, జాహిద్లుగా గుర్తించారు. 2017 నాటి ఓ హత్య కేసులో వీరంతా నిందితులను, పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో వీరికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని సీసీబీ తెలిపింది.
నిందితుల వద్ద నుంచి ఏడు దేశీయ తుపాకులు, 42 లైవ్ బుల్లెట్లు, మందుగుండు, రెండు కత్తులు, రెండు శాటిలైట్ ఫోన్లు, నాలుగు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మదివాలా టెక్నికల్ సెల్లో నిందితులను తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నామని, అందులోని సమాచారంతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారు. ఇదే కేసులో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఇద్దరికోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భారీ స్థాయిలోనే నిందితులు బాంబు దాడికి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
4 walkie-talkies, 7 country-made pistols, 42 live bullets, 2 daggers, 2 satellite phones and 4 grenades recovered from the 5 suspected terrorists arrested by Central Crime Branch (CCB), Karnataka. https://t.co/qqDJb06lOw pic.twitter.com/HTOMHXmkof
— ANI (@ANI) July 19, 2023