దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇప్పటికే బిజెపి నేత రమేష్ బిదూరి కాంగ్రెస్, ఆప్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అతిషి పై బిజెపి సీనియర్ నేత మాజీ ఎంపీ రమేష్ బిందూరి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలు పట్టించుకోని అతిషి.. ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం నగరవ వ్యాప్తంగా జింకల పరిగెడుతున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగర వీధుల పరిస్థితి చూడండి. గడిచిన నాలుగేళ్లలో అతిశి ఎప్పుడు కూడా ఈ సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకల ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారని రమేష్ బిదురి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.