అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజిల్లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనుండగా.. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బాలరాముడి విగ్రహం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.
బాలరాముడి విగ్రహ ప్రత్యేకతలు ఇవే..
- 51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలరాముడి విగ్రహం
- నల్లని రాతితో కమలంలో నిలబడి ఉన్నట్లు విగ్రహం తయారీ
- విగ్రహాన్ని రూపొందించిన కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్
- ఏటా శ్రీరామనవమి రోజు గర్భగుడిలోని రాముడిపై సూర్యకిరణాలు
- రాముడి నుదుటిపై 6 నిమిషాలు సూర్యతిలకం పడేలా అద్దాలు ఏర్పాటు
- తూర్పు ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు
- దర్శనానంతరం దక్షిణ దిశ నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు
- ఆలయ కాంప్లెక్సులో ఒకేసారి 70 వేల మంది ఉండేలా నిర్మాణం
- ఆలయ నిర్మాణంలో ఒడిశా, యూపీ, రాజస్థాన్ శిల్పకారులు
- రామమందిర నిర్మాణానికి 2,587 ప్రాంతాల నుంచి మట్టి సేకరణ