అయోధ్య రామమందిరం ఓపెనింగ్​కు ముహూర్తం ఫిక్స్

-

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య రామ మందిరం. ఈ ఆలయం నిర్మాణ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇక త్వరలోనే రామ మందిరం ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా..?

అయోధ్యలో నిర్మిస్తున్న నూతన రామాలయ గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి తర్వాత జనవరి 21, 22, 23 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది మతపెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా రామ్​లల్లా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించనున్నట్లు పేర్కొంది.

ప్రముఖ సాధువులు, ఇతర అతిథులతో పాటు రావాలనే ఉద్దేశం ఉన్న ఇతర రాజకీయపార్టీల నేతలను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక వేడుక జరుగుతుందని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో వేదిక కానీ బహిరంగ సభ కానీ ఉండదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news