పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక మోహన్ కలిసి నటించిన సినిమా OG. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించారు. అర్జున్ దాస్, ప్రకాష్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రతిభావంతుల నటి నటులు ఈ సినిమాను మరింత రసవత్తరంగా మార్చారు. డివిడి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతలుగా వ్యవహరించారు. “OG” సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ – వివరణ : కథకు విషయానికి వస్తే, OG సినిమా ఒక సాధారణ గ్యాంగ్‌స్టర్ స్టోరీగా కనిపించినప్పటికీ కొత్త స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో ఒక రాజు అతనికి రక్షకుడిగా నిలిచిన ఓ యోధుడు గంభీర ప్రధానంగా కనిపిస్తారు.ఇక 1993లోని ముంబై నేపథ్యంతో, పోర్టుకు అధిపతి సత్య దాదా(ప్రకాష్ రాజ్) కోసం ఓజాస్ గంభీర(పవన్ కళ్యాణ్ ) కృషి చేస్తాడు. కొన్ని కారణాల వల్ల గంభీర, సత్య దాదా దగ్గర నుంచి దూరంగా వెళ్ళాల్సి వస్తాడు.
సత్య దాదా పక్కన గంభీర లేడు అని తెలుసుకున్న తర్వాత, పోర్టును సొంతం చేసుకోవాలనుకునే ప్రతినాయకులు యథాతథముగా పోటీ పడతారు. పరిస్థితి తెలుసుకున్న గంభీర మళ్లీ పోర్టుకు తిరిగి వస్తాడు. ఈ సందర్భంలో అతని గతం, సత్య దాదా తో సంబంధం, అర్జున్ దాస్, ఓంకార్ వర్ధన్ (ఇమ్రాన్ హష్మీ) వంటి పాత్రల ప్రభావం కథలో కీలకంగా మారుతుంది. అసలు గంభీర ఎదుర్కొన్న సవాళ్లు, అతని గతం ఏమిటి? సత్యదాదాతో ఉన్న బంధం ఏమిటి ?తెలుసుకోవాలంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : పవన్ కళ్యాణ్ నటన, హీరో ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ , తమన్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్, కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ , ఆల్రెడీ తెలిసినట్టు ఉండే కథ
చివరిగా చెప్పాలంటే: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి OG సినిమా నిజమైన ట్రీట్. సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సుజిత్ ప్రజెంట్ చేసిన విధానం నిజంగా ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ స్టోరీ, ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. తమన్ సంగీతం మరియు కెమెరా వర్క్ సినిమాకు అదనపు గ్లామ్. యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను చివరి సీన్ వరకు కట్టిపడేసేలా ఉంటాయి. సాలిడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇష్టపడే ప్రేక్షకులు OG సినిమాకు పూర్తిగా ఫిదా అవుతారు.
(గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.)