వన్డే వరల్డ్ కప్-2023 నుంచి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. వన్డే వరల్డ్ కప్-2023 ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్కతా వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 93 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 44.3 ఓవర్లలో 244 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
వన్డే ప్రపంచకప్ ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్ ఐదు మ్యాచ్ ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. అయితే…. ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ గా వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభించాడు బాబర్ అజామ్. ఇప్పటిదాకా 8 ఇన్నింగ్స్ లో 4 హాఫ్ సెంచరీలు వచ్చిన, ఒక్క దాంట్లో కూడా బ్యాటర్ గా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. నెం.1 బ్యాటర్ ర్యాంకును కూడా కోల్పోయిన బాబర్ అజామ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నాడని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది.