World Cup 2023 : మ్యాచ్ ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్‌ సంచలన ఆరోపణలు

-

సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో తబ్రెజ్ షంసీ ఎల్బిడబ్ల్యును అంపైర్ అవుట్ గా పరిగణించి ఉంటే తామే గెలిచేవాళ్ళమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నారు. ‘అంపైర్స్ కాల్ వల్ల మాకు నష్టం జరిగింది. లేదంటే సెమీస్ రేసులో ఉండేవాళ్ళం. తర్వాతి మ్యాచ్ లో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. పాయింట్ల పట్టికలో ఎక్కడ నిలుస్తామో చూద్దాం.

Babar Azam Losing Captain Against South Africa World Cup 2023

ప్రస్తుతం మా జట్టు మొత్తం తీవ్ర నిరాశలో ఉంది’ అని బాబర్ పేర్కొన్నారు. అయితే.. నిన్న జరిగిన మ్యాచ్లో అంపైర్స్ కాల్ నిబంధన కారణంగానే సౌత్ ఆఫ్రికా చేతిలో పాక్ ఓడిందంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ అదే తరహాలో అవుటయినప్పుడు, గత వరల్డ్ కప్ సెమీస్ లో కోహ్లీని ఇలాగే అవుట్ ఇచ్చినప్పుడు నోరు మెదపలేదు ఎందుకు అంటూ నెటిజన్లు భజ్జిపై మండిపడుతున్నారు. పాక్ అంటే ఎందుకంత ప్రేమ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news