‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024’ విడుదలయ్యాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది. ఇక రెండో ప్లేస్‌లో అదే దేశానికి చెందిన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిలిచింది. ఇక బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. ఇంపీరియల్ కాలేజ్ లండన్ పదో ర్యాంకు దక్కించుకుంది. భారత్ నుంచి అత్యున్నత విద్యాసంస్థగా బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐఐఎస్‌సీ) స్థానం సంపాదించుకుంది.
భారత్‌కు సంబంధించినంత వరకు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లలో 100-125 ర్యాంకుల కేటగిరీలో; ఫిజికల్ సైన్స్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో.. లైఫ్ సైన్సెస్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో బెంగళూరు ఐఐఎస్‌సీ స్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి హైదరాబాద్ ఐఐఐటీకి ఇంజినీరింగ్ విభాగంలో 201-600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించగా.. ఇంజినీరింగ్ కేటగిరీలో అన్నా విశ్వవిద్యాలయం 301-400 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకుంది. మరోవైపు జామియా మిల్లియా ఇస్లామియా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్; శిక్షా ‘ఒ’ అనుసంధాన్ డీమ్డ్ యూనివర్సిటీలు 401-500 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి.