దేశవ్యాప్తంగా వంద 5జీ ల్యాబ్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ

-

2014  కేవలం తేదీ కాదని, ప్రజలు కోరుకున్న మార్పు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అప్పుడు కాలపరిమితి ముగిసిన ఫోన్‌ను మార్చి….తమకు సేవచేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. దిల్లీలోని ప్రగతి మైదాన్​లో 7వ ఇండియన్​ మొబైల్ కాంగ్రెస్​ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 100 5జీ ల్యాబ్స్​ ప్రారంభోత్సవంలో పాల్గొని.. దేశం ఏవిధంగా మొబైల్‌ ఫోన్ల ఎగుమతిదారుగా మారిందో వివరించారు.

‘2014కు ముందు భారత్‌ వద్ద కేవలం వందల సంఖ్యలో మాత్రమే అంకురాలు ఉండేవి. ఇప్పుడా సంఖ్య లక్షకు దరిదాపులకు చేరింది. ఈ పురోగతి దేశంలోని యువతకు ఎంతో మేలు చేస్తుందని విశ్వసిస్తున్నాను. మీరు పది, పన్నెండేళ్ల క్రితం నాటి ఫోన్‌ను గుర్తు చేసుకోండి. అప్పుడు కాల పరిమితి ముగిసిన ఫోన్‌ స్క్రీన్‌ మళ్లీ మళ్లీ హ్యాంగ్‌ అయ్యేది. ఎన్నిసార్లు స్క్రీన్‌ను స్వైప్‌ చేసినా లేదా ఎన్నిసార్లు బటన్లు నొక్కినా ప్రయోజనం ఉండేది కాదు. అలాంటి పరిస్థితే అప్పటి ప్రభుత్వానికీ ఉండేది. 2014లో ప్రజలు కాలంపరిమితి ముగిసిన అలాంటి ఫోన్‌ను వదిలేశారు. సేవ చేసే అవకాశం మాకు ఇచ్చారు. ఈ మార్పు వల్ల ఏమైందంటే….అప్పుడు మనం ఫోన్లను దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు మనం మొబైల్‌ ఫోన్ల ఎగుమతిదారులం.’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version