బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన షేక్ హసీనాకు సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. 2019 తర్వాత మొదటిసారి ఆమె భారత దేశంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న షేక్ హసీనాకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.
త్రివిధ దళాల సైనిక వందనంతో ఆహ్వానం పలికారు. కోవిడ్ కాలంలోనూ, ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలోనూ భరత్ అందించిన సాయం గొప్పదని ఆమె కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరుదేశాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షతో సమైక్యంగా ముందుకు సాగుతామని షేక్ హసీనా అన్నారు. పీపుల్స్ ఫెడరేషన్, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ ప్రధాన కర్తవ్యం అని హసీనా తెలిపారు. ఈ సమస్యలపై భారత్, బంగ్లాదేశ్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.