బఠిండా మిలిటరీ స్టేషన్ లో కాల్పులు.. వారి పనే!

-

పంజాబ్  బఠిండాలోని మిలిటరీ స్టేషన్ లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు బఠిండా ఎస్పీ అజయ్‌ గాంధీ వెల్లడించారు. మాస్క్‌లు ధరించి ఈ దారుణానికి తెగబడినట్లు పేర్కొన్నారు. దాడి తర్వాత వారు దగ్గర్లోని అడవిలోకి పారిపోయినట్లు తెలిపారు.

ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాల్పులు ఎవరు జరిపారో ఇంకా స్పష్టత లేదని  తెలిపారు. ఒకరి చేతిలో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతిలో గొడ్డలి ఉన్నట్లు సమాచారం. 22 రౌండ్ల తూటాలతో సహా రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇన్సాస్ రైఫిల్ అంశం దీనికి కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది.

కాల్పుల్లో మృతి చెందిన నలుగురు సైనికుల వయసు 20 నుంచి 30 మధ్యే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆ సమయంలో వారంతా నిద్రలో ఉన్నారని పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరిది కర్ణాటక కాగా.. మరో ఇద్దరిది తమిళనాడు అని తెలిపారు. మృతుల బంధువులకు ఈ సమాచారాన్ని అందించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version