బెంగళూరు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు.. వీడియో వైరల్ !

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లోకి కూడా వరద నీరు చేరింది.

వరదల వల్ల ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ కూడా రాసింది.

అంతేకాదు…కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపైన ఉన్న బైక్‌ లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అలాగే.. వాహనదారులు కూడా దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనుషులు రోడ్లపై నడుచే ఛాన్స్‌ లేకుండా.. వరద.. రోడ్లపైకి వచ్చింది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.