కర్ణాటకలో సంచలనంగా మారిన రేణుకా స్వామి హత్యకేసులో కీలకమైన ఫోటోలు బయటకువచ్చాయి. తన దగ్గర పనిచేస్తున్న స్వామిని హత్య చేయడానికి ముందు కన్నడ హీరో దర్శన్, అతని అనుచరులు అతడిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పాటు అర్థనగ్నంగా మార్చి ఫోటోలు తీసినట్లు సమాచారం. ఓ లారీ ఎదుట బట్టలు లేకుండా ఏడుస్తూ ఉన్న రేణుకాస్వామి ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మరో ఫోటోలో అతను కిందపడిపోయి చలనం లేకుండా ఉన్నాడు.
అప్పటికే మరణించి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్శన్,తన భార్య, స్నేహితులతో కలిసి రేణుకాస్వామిని తీవ్రంగా హింసించి దాడి చేయడంతో అతను మరణించినట్లు ఈ ఫోటోలను చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. దర్శన్ స్నేహితులు ఒకరి మొబైల్లో రేణుకాస్వామిని హింసించిన చిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటికే కన్నడ హీరో దర్శన్ సహా పలువురు బెంగళూరులోని జైలులో శిక్ష అనుభవిస్తున్నవిషయం తెలిసిందే.